Header Banner

ఆ అమ్మాయితో నాకు ఎలాంటి సంబంధం లేదు! ఓ వివాదంపై క్లారిటీ ఇచ్చిన శేఖర్ మాస్టర్!

  Sun Apr 27, 2025 12:19        Entertainment

ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఓ డ్యాన్స్ షోకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తుండగా, ఆ షోలో విజేతగా నిలిచిన జాను లిరితో ఆయనకు ఏదో సంబంధం ఉందంటూ ఇటీవల సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపించాయి. డ్యాన్స్ షోలో ఫోక్ డ్యాన్సర్ జాను లిరిని శేఖర్ మాస్టర్ ప్రశంసలతో ముంచెత్తడంతో వీరి మధ్య సంబంధం ఉందనే రూమర్లు అధికమయ్యాయి. శేఖర్ మాస్టర్ అండతోనే ఆమె విజేత అయిందంటూ ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్‌పై తాజాగా శేఖర్ మాస్టర్ స్పందిస్తూ దీనిపై క్లారిటీ ఇచ్చారు. తమ మధ్య ఎటువంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు.

 

ఇది కూడా చదవండి: పోలీసుల అదుపులో బంగ్లాదేశ్‌ వ్యక్తి! వీసా నిబంధనలపై సందేహాలు.. విచారణలో కీలక మలుపు!

 

తాను ఒక షోకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నానంటే చాలా నిజాయితీగా ఉండాలన్నారు. ఎన్నో ఆశలతో డ్యాన్సర్లు ఈ షోలకు వస్తారు కాబట్టి అక్కడ ప్రతిభను మాత్రమే చూడాలన్నారు. జాను అనే అమ్మాయి అందరికంటే చాలా ప్రత్యేకంగా డ్యాన్స్ చేసిందని తనకు అనిపించిందన్నారు. అందుకే తాను ఆమెను ప్రోత్సహించానని, ప్రతిభ కనబర్చిన ఎవరినైనా అలాగే ప్రోత్సహిస్తానని చెప్పారు. ఆమె కష్టపడి డ్యాన్స్ చేసింది కాబట్టే విజేత అయిందని, అందులో తాను చేసింది ఏమీ లేదన్నారు. గతంలో కూడా తనపై ఇలాంటి రూమర్స్ వచ్చాయని, కానీ తాను వాటిని పట్టించుకోనని పేర్కొన్నారు. తాను డ్యాన్స్ షోలలో కేవలం ప్రతిభ ఉన్న వారిని మాత్రమే ప్రోత్సహిస్తాను కాబట్టే న్యాయనిర్ణేతగా నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారని చెప్పారు. 

 

ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్ట్ లిస్ట్ రెడీ! కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎప్పుడంటే?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!

 

రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!

 

రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!

 

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

 

వివేకా కేసులో బిగ్ ట్విస్ట్.. రంగన్న భార్యకు సిట్ నోటీసులు.. ఈ వరుస మరణాల వెనుక.!

 

మరో పదవిని కైవసం చేసుకున్న కూటమి ప్రభుత్వం! 74 మంది మద్దతుతో..

 

ఏపీలోని కూటమి ప్ర‌భుత్వానికి కేంద్ర గుడ్‌న్యూస్.. ఆ నిధుల‌ విడుద‌ల!

 

వైసీపీ నేతకు దిమ్మదిరిగే షాక్! అప్పుల భారం - ఆస్తులు వేలం!

 

ఢిల్లీలో జరిగిన గంటల చర్చలు.. కీలక నిర్ణయాలు ! వాటికి ఓకే చెప్పిన మోదీ!

 

దెబ్బకు ఠా దొంగల ముఠా! లిక్కర్ కేసులో మరో నిందితుడు అరెస్ట్!

 

టీటీడీ కీలక నిర్ణయం! ఇకనుండి భక్తులకు అవి ఉచితం! ప్రవాసాంధ్రులకు కూడా భాగస్వామ్యం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Tollywood #ShekharMaster #RumorsOfRealtionship #JanuLiri #Dhee